satveeracademy

Advertisements

ఉపాధ్యాయ దినోత్సవం

[05/09, 16:31] +91 99665 35381: చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో…
భూమి చూసి ఓర్పు నేర్చుకో…
చెట్టును చూసి ఎదుగుదల నేర్చుకో…
ఉపాధ్యాయుని చూసి సుగుణాలు నేర్చుకో….
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞
[05/09, 16:31] +91 99665 35381: 🙏🏻🇮🇳🧭🧭🧭🧭🧭🧭
శుభప్రదమైన రోజు
గురు అక్షరమాల స్తుతి
***
అ – అద్వైతమూర్తి – గురువు
ఆ – ఆనందస్ఫూర్తి – గురువు
ఇ – ఇలదైవం – గురువు
ఈ – ఈశ్వరరూపము – గురువు
ఉ – ఉద్ధరించువాడు – గురువు
ఊ – ఊర్ధ్వముఖుడు – గురువు
ఋ – ఋజువర్తనుడు – గురువు
ౠ – ఋణము లేనివాడు – గురువు
ఎ – ఏమిలేదని చెప్పువాడు – గురువు
ఏ – ఏకమేవాద్వితీయం బ్రహ్మ – గురువు
ఐ – ఐశ్వర్య ప్రదాత – గురువు
ఒ – ఒక్కటే ఉన్నది అని చెప్పువాడు – గురువు
ఓ – ఓంకార రూపము – గురువు
ఔ – ఔదార్య మేరువు – గురువు
అం – అందరూ సేవించేది – గురువు
అః – అహంకార రహితుడు – గురువు
క – కళంకము లేనివాడు – గురువు
ఖ – ఖండరహితుడు – గురువు
గ – గుణాతీతుడు – గురువు
ఘ – ఘనస్వరూపము – గురువు
ఙ – జిజ్ఞాసులకు జ్ఞానప్రదాత – గురువు
చ – చక్రవర్తి – గురువు
ఛ – ఛత్రము వంటి వాడు – గురువు
జ – జనన మరణములు లేని వాడు – గురువు
ఝ – ఝరులవలె బోధించువాడు – గురువు
ఞ – జ్ఞానస్వరూపము – గురువు
ట – నిష్కపటుడు – గురువు
ఠ – నిష్ఠకలవాడు – గురువు
డ – డంబము లేనివాడు – గురువు
ఢ – ఢంకా మ్రోగించి చెప్పువాడు – గురువు
ణ – తూష్ణీభావము కలవాడు – గురువు
త – తత్త్వోపదేశికుడు – గురువు
థ – తత్త్వమసి నిర్దేశకుడు – గురువు
ద – దయాస్వరూపము – గురువు
ధ – దండించి బోధించువాడు – గురువు
న – నవికారుడు – గురువు
ప – పంచేంద్రియాతీతుడు – గురువు
ఫ – ఫలాకాంక్షా రహితుడు – గురువు
బ – బంధము లేనివాడు – గురువు
భ – భయరహితుడు – గురువు
మ – మహావాక్యబోధకుడు – గురువు
య – యమము కలవాడు – గురువు
ర – రాగద్వేష రహితుడు – గురువు
ల – లవలేశము ద్వేషము లేనివాడు – గురువు
వ – వశీకరణశక్తి కలవాడు – గురువు
శ – శమము కలవాడు – గురువు
ష – షడ్భావ వికారములు లేనివాడు – గురువు
స – సహనశీలి – గురువు
హ – హరిహర రూపుడు – గురువు
ళ – నిష్కళంకుడు – గురువు
క్ష – క్షరాక్షర విలక్షణుడు – గురువు
ఱ-ఎఱుకతో ఉన్నవాడు – గురువు
***
అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు
***
*GOOD MORNING*
***
*Is it not ironic? We ignore those who adore us, adore those who ignore us, hurt those who love us and love those who hurt us.*


**HAPPY TEACHERS DAY** ***

🙏🏻🇮🇳🇮🇳🧭 🙏🏻🇮🇳🧭💥👍
[05/09, 16:31] +91 99665 35381: బడి అనే నారుమడిలో.. విద్యా అనే విత్తనం వేసి.. అక్షరం అనే నీరు పోసి.. చెడు అనే కలుపుతీసి.. మంచి, నీతి అనే ఫలాన్ని సమాజానికి అందించేవాడే ఉపాధ్యాయుడు. అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి, జ్ఞానం అనే వెలుగును ప్రసాదించే చైతన్య శిల్పి గురువు.. అంతటి ఉన్నతమైన వ్యక్తి కాబట్టే ఆది యుగం నుంచి ఆధునిక కాలం వరకు ఆయనే రుషి… సమాజ దేవాలయానికి నిజమైన రక్షకుడు… అందుకే మన సమాజంలో అమ్మా నాన్నల తర్వాతి స్థానం గురువులకు ఇచ్చారు.
ఆదియుగం నుంచి ఆధునికయుగం వరకు ఆయనే రుషి.. జీవన వికాసానికి నిచ్చెన వేసే అక్షర కార్మికుడు… సమాజ దేవాలయానికి నిజమైన రక్షకుడు.. ఆయనెవరో కాదు మనందరికీ విద్యా బుద్ధులు నేర్పే గురువు. అందుకే మన సమాజంలో అమ్మానాన్నల తర్వాత స్థానం గురువులకు ఇచ్చారు. శిశువును లోకానికి పరిచయం చేసిన అమ్మ మొదటి గురువైతే, గుండెలపై తన్నుతూ ఆటలాడే శిశువుకు నడక నేర్పే నాన్న రెండో గురువు. ఆ తర్వాత ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో నేర్పి, విద్యా బుద్ధులు అందించే ఉపాధ్యాయుడు మూడో గురువు. అందుకే పెద్దలు మాతృదేవో భవ.. పితృదేవో భవ.. ఆచార్య దేవోభవ అని అన్నారు. ఇంతటి ఉన్నతమైన ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చి, గురువు జాతి గౌరవాన్ని లోకానికి చాటి చెప్పిన మన దేశ రెండో రాష్ట్రపతి, మేధావి, విద్యావేత్త అయిన డాక్టర్‌ సర్వేపల్లి రాధకృష్ణ జయంతిని ప్రభుత్వం ఉపాధ్యాయ దినోత్సవంగా గుర్తించింది. ప్రతి యేటా సెప్టెంబర్‌ 5న గురువులను సన్మానించుకునే అవకాశాన్ని ఇచ్చింది. అందుకే అందుకోండి గురు దేవుల్లారా.. మా పాదాభివందనాలు.. వేలవేల వందనాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Scroll to Top