satveeracademy

Advertisements

రేఖగణితం కవిత

అమ్మ చేసిన రొట్టె వృత్తము
సగానికి మడిచిన దోసె అర్ధ వృత్తము
మనం కూర్చునే స్టూల్ చతురస్త్రం
పడుకునే మంచం దీర్ఘ చతురస్త్రం
మనకిష్టమైన లడ్డూఒక గోళము
సగం మన మిత్రునికిస్తే అర్ధ గోళము
మన తరగతి గది ఒక ఘనం
మనం కూర్చునే బెంచీ ఒక దీర్ఘ ఘనం
మన జెండా కర్ర ఒక స్థూపం
కొడవలి మలుపు ఒక చాపం
ధాన్యపు రాశి ఒక శంఖువు
రూపాయి రూపాయి కలిపితే కూడిక
కొనడానికి కొంత తీస్తే తీసివేత
తలా పది పంచితే భాగహారం
హెచ్చిస్తే గుణకారం
కూర్చుంటే జడత్వం
కదిలితే చలనం
పరిగెత్తితే వేగం
ఆగి ఆగి పరుగు తీస్తే త్వరణం
పడిపోతే ఆకర్షణ
విడిపోతే వికర్షణ
తన చుట్టూ తాను తిరిగితే భ్రమణం
గుడి చుట్టూ తిరిగితే పరిభ్రమణం
మాట్లాడడానికి శక్తి
పనిచేయడానికి బలం
గంటకు ఎంతపని చేస్తావో అది సామర్థ్యం
వింటున్నా మంటే శబ్దం
చూస్తున్నామంటే వెలుగు
రంగులన్ని వర్ణ పటం
ఆహారం అరగడం జీవక్రియ
అరిగిన ఆహారం శక్తిగా మారడం రసాయన క్రియ
ఉచ్వాస నిశ్వాసాలు శ్వాస క్రియ
నేను చూశాను భూతకాలం
నేను చూస్తున్నా వర్ధమాన కాలం
నేను చూడ బోతున్నా భవిష్యత్ కాలం
నాకు తొంభై ఏళ్ళు ఇక పోయే కాలం

బతుకుల్లో లేనిది ఏముంది శాస్త్రాల్లో ..

సరిగా అర్థం చేసుకుంటే మన బతుకే ఒక శాస్త్రం…
మనిషిని, ఇతర ప్రాణుల్ని , ప్రకృతిని గురించి తెలుసుకోవడం తప్ప.
భయమెందుకు నీకు …
నీకంటే ప్రపంచంలో ఎవరు గొప్ప…
తెలుసుకో పదిలంగా
నేర్చుకో సులభంగా…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Scroll to Top