satveeracademy

Advertisements

సౌష్ఠవం  

ఒక వస్తువు యొక్క ఆకారానికి అందాన్ని తెచ్చే  క్రమత్వపు / సమత్వపు లక్షణాన్ని సౌష్ఠవం  అంటారు.

 

ఆకారంలో ఉన్న సమత్వం, క్రమత్వం  బట్టి వస్తువుల ఆకారంలో ఉండే లక్షణాన్ని సౌష్ఠవం  అంటారు. 

రేఖా సౌష్ఠవం :  ఏదైనా ఒక పటమును ఒక రేఖా ఆధారంగా రెండు సర్వ సమాన భాగాలుగా విభజిస్తే ఆ పటం రేఖా సౌష్ఠవం లేదా పరావర్తన  సౌష్ఠవం కలిగి ఉంది అంటారు .

 సౌష్ఠవరేఖ లేదా సౌష్ఠవాక్షము :-

ఒక పటమును రెండు సర్వ సమాన భాగాలుగా విభజించునట్లు పటము మధ్యగా గీయదగు రేఖను ఆ పటము యొక్కసౌష్ఠవ రేఖలేదాసౌష్ఠవాక్షములేదాపరావర్తన అక్షము”  అంటారు.

ఏ గీత వెంబడి మన చిత్రాన్ని మడిచినప్పుడు రెండు భాగాలు ఒకదానితో ఒకటి సరిగ్గా ఏకీభావిస్తాయో ఆ రేఖానే సౌష్ఠవ రేఖ అంటారు.

 

ఇది  అడ్డంగా లేదా నిలువుగా లేదా ఒక మూలగా ( కర్ణం వెంబడి) ఉండవచ్చు .

సాధారణంగా  సౌష్ఠవాక్షాన్ని చుక్కల  రేఖ చే సూచిస్తాం.

 

కొన్ని పటాలకు ఒక సౌష్ఠవరేఖ మాత్రమె ఉండవచ్చు . కొన్నింటికి ఒకటి కంటే ఎక్కువ సౌష్ఠవాక్షములు ఉండవచ్చు . మరియు కొన్ని పటాలకు సౌష్ఠవ రేఖలు ఉండకపోవచ్చు.

రేఖ సౌష్ఠవం ఉదాహరణాలు  

* ఒక రేఖ ఖండము దాని లంబ సమద్వి ఖండన రేఖపై రేఖ సౌష్ఠవం కల్గి ఉండును.

* ఒక కోణం దాని కోణ సమద్వి ఖండన రేఖపై రేఖ సౌష్ఠవం కల్గి ఉండును 

* ఒక సరళ రేఖకు దాని పైని ప్రతి బిందువు వద్ద గీసిన లంబము సౌష్ఠవాక్షము కలిగి ఉంటుంది .

కావున సౌష్ఠవాక్షముల సంఖ్య అనంతం

* ఒక సమబాహు త్రిభుజానికి సౌష్ఠవాక్షముల సంఖ్య

దాని ప్రతి కోణ సమద్వి ఖండన రేఖపై రేఖ సౌష్ఠవం కల్గి ఉండును

* ఒక సమద్విబాహు త్రిభుజానికి సౌష్ఠవాక్షముల సంఖ్య-1 

సమాన భుజాల మధ్య కోణ సమద్వి ఖండన రేఖ రేఖ సౌష్ఠవం కల్గి ఉండును.

* ఒక విషమబాహు త్రిభుజానికి సౌష్ఠవాక్షముల సంఖ్య-౦

 

సమలంబ చతుర్భుజానికి (ట్రెపీజియం) కు సౌష్ఠవ కేంద్రములు లేవు.

సమాంతర  చతుర్భుజానికి కు సౌష్ఠవ కేంద్రములు లేవు.

 దీర్ఘ చతురస్రం కు  కు సౌష్ఠవాక్షముల సంఖ్య-2

2 జతల ఎదుటి భుజాల యొక్క లంబ సమద్వి ఖండన రేఖలు

రాంబస్ ( సమ చతుర్భుజం ) కు  కు సౌష్ఠవాక్షముల సంఖ్య-2 ( రెండు కర్ణములు)

చతురస్రం   కు సౌష్ఠవాక్షముల సంఖ్య4  ( రెండు కర్ణములు, 2 జతల ఎదుటి భుజాల యొక్క లంబ సమద్వి ఖండన రేఖలు

గాలి  పటం ఆకారానికి సౌష్ఠవాక్షముల సంఖ్య-1

ఒక బాణతల ఆకారంలోని పటానికి  సౌష్ఠవాక్షముల సంఖ్య-1

ఒక వృత్తమునకు సౌష్ఠవాక్షం దాని వ్యాసం అవుతుంది.

ఒక  వృత్తమునకు సౌష్ఠవాక్షల సంఖ్య ……  అనంతం

అర్ధ వృత్తమునకు సౌష్ఠవాక్షల సంఖ్య ……1 ( వ్యాసం యొక్క లంబ సమద్వి ఖండన రేఖ )

ఒక క్రమ షడ్భుజికి సౌష్ఠవాక్షల సంఖ్య ……6 ( 3 జతల ఎదుటి భుజాల యొక్క లంబ సమద్వి ఖండన రేఖలు)

 

ఒక క్రమ బహుభుజి n  భుజాలు కల్గి ఉన్నచో దానికి ఉండు సౌష్ఠవాక్షల సంఖ్య ……n

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Scroll to Top