
కోణం : ఒకే తోలి బిందువు గల రెండు కిరణాల మధ్య గల ఖాళీ ప్రదేశాన్ని కోణం అంటారు
ఒకే బిందువు నుండి రెండు కిరణాలు వెలువడినప్పుడు కోణం ఏర్పడుతుంది.
ఈ కోణాన్ని ఏర్పరిచే కోణాలను కోణ భుజాలు అంటారు .
ఈ ఉమ్మడి బిందువును కోణ శీర్షము అంటారు.
కోణాన్ని ‘ θ ‘ చే సూచిస్తారు.
ఒక కిరణం తోలి స్థానము నుండి తుది స్థానమునకు భ్రమణం చేయడం వలన కోణం ఏర్పడుతుంది.
స్థిర బిందువు “O” ఆధారంగా ఒక కిరణం తోలి స్థానము నుండి తుది స్థానమునకు కలిగే మార్పును భ్రమణము అంటారు.
ఈ భ్రమణం కొలతను కోణమానితో కొలవగా వచ్చిన విలువను కోణం అంటారు.
ఒక పూర్తి భ్రమణ విలువ … 3600
ధన కోణం :- మలికిరణం (తుది కిరణం ) అపసవ్య దిశలో భ్రమించి ఏర్పరచు కోణమును ధన కోణం అంటారు.
ఋణకోణం :- మలికిరణం (తుది కిరణం ) సవ్య దిశలో భ్రమించి ఏర్పరచు కోణమును ఋణ కోణం అంటారు.
అల్ప కోణము(లఘుకోణం ) :- ఒక కోణము విలువ 00 కన్నా ఎక్కువ మరియు 900 కన్నా తక్కువ అయిన ఆ కోణం అల్ప కోణము అగును.
లంబ కోణము (సమకోణం ) :- ఒక కోణము విలువ 900 కు సమానము అయిన ఆ కోణం లంబకోణము అగును.
అధిక కోణము (గురుకోణం ) :- ఒక కోణము విలువ 900 కన్నా ఎక్కువ మరియు 1800 కన్నా తక్కువ అయిన ఆ కోణం అధిక కోణము అగును.
సరళ కోణము :- ఒక కోణము విలువ 1800 కు సమానము అయిన ఆ కోణం సరళకోణము అగును.
పరావర్తన కోణము :- ఒక కోణము విలువ 1800 కన్నా ఎక్కువ మరియు 3600 కన్నా తక్కువ అయిన ఆ కోణం పరావర్తన కోణము అగును.
సంపూర్ణ కోణము :- ఒక కోణము విలువ 3600 కు సమానము అయిన అట్టి కోణం సంపూర్ణకోణము అగును.
శూన్య కోణము :- ఒక కోణము విలువ 00 కు సమానము అయిన ఆ కోణం శూన్యకోణము (సున్న కోణము ) అగును.
భ్రమణమేదీ లేకుండా గమ్య కిరణం తోలి కిరనంతో కలిసి ఉంటె అచట ఏర్పడిన కోణం సున్నా కోణం అంటారు.