satveeracademy

Advertisements

రేపటి కళలను నిజం
చేయుటలో మనకు అడ్డు వచ్చేవి ఈ రోజు మనకున్న సందేహాలే
రూజ్
వెల్ట్

24 గంటలలో దేశ
ప్రతిష్ఠకి  సంబంధించిన ప్రతిష్ఠాత్మక
టోర్నీ ఒకవైపు, 

మరోవైపు మూడున్నర సంవత్సరాల కన్న
కొడుకు గుండె ఆపరేషన్,  

ఒకవైపు దేశ గౌరవం,

 మరోవైపు కన్న తల్లి ఆవేదన, 

చివరికి ఆమె
అంకితభావం ముందు ఆమె అమ్మతనం చిన్నబోయింది వరుసగా
5వ సారి బాక్సింగ్ ఛాంపియన్ గా  నిలవటమే కాక దేశ ప్రతిష్టను ఇనుమడింప చేసిన మహిళా
బాక్సర్ మేరీకామ్ .

ప్రాణం కంటే ఎక్కువగా క్రికెట్ ను ప్రేమించి రెండు దశాబ్దాల పాటు భారత
దేశాన్ని అంతర్జాతీయ క్రికెట్ పటంలో నిలిపేందుకు అహర్నిశలు  శ్రమించి తన పుట్టిన రోజునే
 ప్రపంచ క్రికెట్ దినం గా
ఐసీసీ గుర్తించే స్థాయిలో ఎదిగాడు. ఆ అంకితభావమే ప్రతి భారతీయుని
గుండెల్లో స్థానం ఏర్పరిచింది. అతడే
సచిన్
టెండూల్కర్
.

ఏడు పదుల వయసులో
అవినీతికి వ్యతిరేకంగా ఒక వ్యక్తి  ప్రారంభించిన
ఉద్యమం కాలేజీ కుర్రకారు నుండి తలలు పండిన మేధావుల వరకు,  కార్పొరేట్ అధిపతి మొదలు సామాన్య మానవుని వరకు చైతన్యానికి
కారణమై ప్రభుత్వాన్ని ఒప్పించగలిగింది. ఈ విజయానికి కారణం అతని అంకితభావమే.  అతనే
అన్నా హాజారే.

ప్రతి సంఘటన నుండి
మనకి అర్థమవుతుంది ఏమంటే విజయం సాధించాలంటే తెలివితేటలు, కృషి,  పట్టుదల ఉంటే సరిపోదు వీటన్నింటిని  మించి సాధించే లక్ష్యం మీద  ప్రేమ ఉండాలి. అంకితభావంతో లక్ష్యసాధనకు పోరాడాలి.
 
అప్పుడే అంకితభావం మీ విజయానికి ఆయుధం అవుతుంది.

విజయాన్ని సాధించే క్రమంలో వైఫల్యం ఎందుకు పడుతున్నారు?  ఎందుకు లక్ష్యాల నుండి వైదోలుగుతున్నారు?  ఎందుకు పరాజితులుగా మిగిలిపోతున్నారు? మరి ఇలాంటి వ్యక్తులతో లక్ష్యం పట్ల అంకితభావం ఎందుకు లోపిస్తుంది.

అంకితభావం లోపించడానికి కారణాలు ఏమిటి?

ఎంతో ప్రతిభా పాటవాలు ఉండి కూడా కొంతమందిలో లక్ష్యం పట్ల భయం ఉంటుంది. సాధిస్తానో లేదో అన్న భయంతోనే లక్ష్యం నుండి వైదొలగడమో లేదా పరాజితునిగా మిగిలిపోవడం చూస్తుంటాం.

లక్ష్యం పట్ల స్వేచ్చ ( అంటే తనదైన సొత పంథా ) ఉండదు.  గత పరాజితుల  అనుభవాలు వీరిలో భయాన్ని సృష్టించి లక్ష్యం పట్ల వీరికి గల అంకితభావాన్ని నిర్వీర్యం చేసి లక్ష్యం సాధించాలంటే భయపడే పిరికివానిగా తయారుచేస్తాయి.

భయం లేని చోటే మనసు నిర్భయంగా ఉంటుంది.  భయాన్ని జయించి మనిషి  ధైర్యంగా ఉన్నప్పుడే  మీరు తల ఎత్తుకు తిరుగగలుగుతారు. అప్పుడే మీలో  లక్ష్యం పట్ల స్పష్టమైన అవగాహన ఏర్పడి అంకితభావంతో విజయసాధనకు ఉపక్రమిస్తారు.

మనలో చాలామంది లక్ష్యాన్ని ఏర్పరచుకుని లేని పోని,  అర్థంలేని భయాలతోనే వైఫల్యాల భారీన పడుతున్నారు.

వాస్తవానికి భయం అనేది మనిషికి  జన్యుపరంగా  సంక్రమించిన  ఒక  వరం.  అది మనిషిలో సమపాళ్ళలో ఉంటె కార్యాచరణకు ప్రేరణగా ఉంటుంది.మోతదు  మించితే మనిషిని కుంగదీస్తుంది.

భయం మనిషి అదుపులో ఉంటే అతడు విజయాలు సాధించగలుగుతాడు. అలాకాకుండా భయం అదుపులో మనిషి ఉంటే అతడు పరాజయాల పాలవుతాడు.  

భయాన్ని అదుపులో  పెట్టగలిగే వారు చొరవను  అభివృద్ధి చేసుకోగలుగుతారు. చొరవను పెంచుకోగలిగితే  ఆత్మవిశ్వాసం,  విజయాన్ని సాధించగలమనే నమ్మకం భయాన్ని అదుపులో ఉంచుతుంది.  ఆ చొరవ , ఆ నమ్మకం, ఆ ఆత్మ విశ్వాసమే మీలో  అంకితభావం పెంపొందించడానికి  దోహదం చేస్తుంది.

కష్టపడకుండానే విజయం రావాలి అనే దృక్పథం కూడా  వ్యక్తి  అంకితభావాన్ని దెబ్బతీస్తుంది చాలామందిలో లక్ష్యాలు ఘనంగా  ఉంటాయి.  ఆచరణ మాత్రం శూన్యం గా ఉంటుంది.  ఏ కష్టం పడకుండానే గొప్ప గొప్ప విజయాలు రావాలని కలలు కంటారు. ఏదీ ఉచితంగా రాదు అనే వాస్తవమే ఈ తరహా వ్యక్తులకి  పట్టదు.  అలాంటిదే ఒక చిన్న సంఘటన.

 

 ఒక రాజు తన సలహాదారులు అందరిని పిలిచి తరతరాలుగా మనకు అందించబడిన వివేకాన్ని రాసి ఉంచమని అడిగాడు.  రాబోయే తరాలకి అది ఉపయోగపడుతుందని ఆయన అన్నాడు.  చాలా రోజులు కష్టపడి ఆ వివేకానికి సంబంధించిన విషయాలన్నీ ఎన్నో గ్రంథాల రూపంలో పొందుపరిచి  వాటిని రాజుకు అందజేసారు.  రాజు  ఆ గ్రంథాలన్ని తిరిగేసి అవి మరీ పెద్దగా ఉన్నాయని ఎవరు వాటిని చదవడానికి ఇష్టపడరనీ అన్నాడు.  వాటిని సంక్షిప్తం చేయమని రాజు వారిని ఆదేశించాడు.  అప్పుడు సలహాదారులు పుస్తకాలను తీసుకెళ్లి వాటిలో  విషయాలను కుదించి ఒకే ఒక పుస్తకం రాసి  తిరిగి తీసుకు వచ్చారు.  రాజు అది కూడా పెద్దదిగా ఉందనేటప్పటికి వాళ్లు మళ్లీ ప్రయత్నించి  విషయాన్ని ఒకే ఒక ఒక అధ్యాయం లో పొందు పరిచి తెచ్చారు.  అది కూడా పెద్దదిగానే ఉందని రాజు అన్నాడు. అప్పుడు సలహాదారులు ఒకే ఒక వాక్యంలో ఆ వివేకాన్నంతా  కుదించి  రాసి తీసుకువచ్చారు.  దానితో ఆ రాజు తృప్తి చెందాడు.  ఆయన ఒకే ఒక వాక్యంలో రాబోయే తరాలకు వివేకానంద సలహా రూపంలో వివరించాడు. ఆ సలహా ఏమిటంటే ఏది ఉచితంగా రాదు  పై సంఘటన మీకు అర్థమయ్యే ఉంటుంది.

 

  వ్యక్తిలో అంకితభావం దెబ్బతినడానికి మరో కారణం కొంతవరకు ఆర్థిక పరిస్థితులు కూడా.  విజయం సాధించడానికి ఆర్థిక పరిస్థితులు ఏమాత్రం ఆటంకం కావు అని చెప్పడం సరి అయినది కాదు.  మనలో విజయానికి ఆర్థిక పరిస్థితులు కూడా దోహదం చేస్తాయి.  మనిషిని మనసికంగా కుంగదీసేవి  ఈ ఆర్థిక పరిస్థితులే. కాని  ఇవే ఆర్థిక పరిస్థితులను ఎదుర్కోవడానికి సంసిద్ధుడు కాగలిగితే అపూర్వ విజయాలు  సొంతం చేసుకుంటాడు.  ప్రపంచ ప్రసిద్ధి చెందిన కవులు,  కళాకారులు,  మేధావులు అత్యధికులు దుర్భర దారిద్ర్యం నుంచి వచ్చిన వారే అన్నా విషయం మనం మరిచిపోకూడదు.

 

 

 మనకు అందుబాటులో ఉన్న వనరులన్నీ సద్వినియోగం చేసుకునేందుకు  ప్రయత్నించాలి.  అంతేకానీ  లేనిదాని గురించి ఆలోచిస్తూ మన కళ్ళ ముందు ఉన్న అవకాశాలను వదులుకోకూడదు.  అలాంటిదే ఈ సంఘటన

ఒక వర్తకుడు కొయ్య శిల్పి దగ్గరకు వెళ్లి, చందనం కర్ర నుంచి కృష్ణ ప్రతిమను చెక్కి పెట్టమన్నాడు. మంచి గంధం చెక్కను అన్వేషించటానికి తనకు పది రోజులు గడువు కావాలని చెప్పాడు ఆ శిల్పి. ఆ వ్యవధిలో తనకు సరైన చెక్క దొరకనందుకు చింతిస్తూ ఆ విషయం చెబుదామని వర్తకుని ఇంటికి వెళ్ళాడు. భర్త పనిమీద బయటకు వెళ్ళాడని కాసేపు నిరీక్షించమని చెప్పింది వర్తకుని భార్య. అటూ, ఇటూ చూస్తున్న శిల్పి దృ ష్టి గది మూలన పడి ఉన్న కర్రపై పడింది. దానిని తీసుకోవడానికి అనుమతి అడిగాడు శిల్పి. వర్తకుని భార్య సరేనంది. ఆ కర్ర నుంచి కృ ష్ణ ప్రతిమను చెక్కాడు శిల్పి.

 

ఆ ప్రతిమను చూసి వర్తకుడు ఆశ్చర్యపోయి శిల్పి పనితనాన్ని మెచ్చుకు న్నాడు. ఇంతకాలంగా తమ ఇంట్లో మూలన పడి ఉన్న కర్ర నుండి ఇంత చక్కటి బొమ్మ వచ్చిందంటే తాను నమ్మలేకపోతున్నానని చెప్పాడు. తానేమీ గొప్ప పని చేయలేదని ఆ కర్రనుంచి అక్కరలేని కలప తొలగిస్తే ఆ కృష్ణ ప్రతిమ బయటపడిందని వినయంగా చెప్పాడా శిల్పి.

 

పై సంఘటనలో లాగానే మీరు చెక్కిన కృష్ణ ప్రతిమలాంటి వారే. కాకపోతే గదిలో మూలన ఉన్న కర్రలాగా మీరు ఉండకుండా మీలో ఉన్న భయం, అపనమ్మకం అవగాహన లేమి అనే అవసరం లేని ఆందోళనలను తొలగించుకుని, మీలో సామర్థ్యాలను గుర్తిస్తే, అంకితభావంతో  లక్ష్య సాధనకు ఉపక్రమిస్తే విజయం మీ సొంతమవుతుంది.

 

మరి మనలో అంకితభావం ఎలా పెంపొందుతుంది?

 

పెద్ద పెద్ద అడ్డంకులని అధిగమించిన వారి గురించి మనం చదివినప్పుడు వాళ్ళు విజయం సాధించటానికి వారి తీవ్రమైన ఆంకాంక్ష వారిని ముందుకు నడిపే  శక్తి, ఆకుంఠిత  దీక్ష దోహదం చేశాయనేది స్పష్టం అవుతుంది.

 

అంకితభావంతో ప్రయత్నిస్తే ఎలాంటి వ్యక్తయినా విజయం సాధిస్తాడనడానికి తార్కానాలెన్నో .

 

విల్మ్ రుడాల్ఫ్ అనే అంగవైకల్యం గల స్త్రీని 1960 ఒలంపిక్స్ లో  3 బంగారు పతకాలని సాధించేలా చేసింది ఈ అంకిత భావమే.

 పోలియోతో బాధపడుతున్న ఓ ఐదేళ్ళ బాలిక కాళ్లలోని బలాన్ని తిరిగి పొందడానికి ఈత నేర్చుకోవటం ప్రారంభించింది. విజయం సాధించాలన్న అంకిత భావమే ఆమె 3 సార్లు ప్రపంచ రికార్డు సృ ష్టించి, ఈత పోటీలలో 1956 ఒలంపిక్స్లో మెల్బోర్న్ లో బంగారు. పతకాన్ని గెలుచుకునేలా చేసింది. ఆమె పేరు షెల్లీ  మున్న్,

 

ఎప్పుడైతే ఒక వ్యక్తి తన లక్ష్యాన్ని మార్గాన్ని కోల్పోతాడో అతడికి అవకాశం అగుపించదు. ఒక వ్యక్తి దేన్నైనా సాధించాలని కోరిక ఉంటే తన లక్ష్యాన్ని సాధించటానికి ఎన్నుకోవలసిన మార్గం ఏదో తెలిస్తే, లక్ష్యం పైనే దృష్టిని కేంద్రీకరించటానికి అవసరం అయిన అకుంఠిత దీక్ష ఉంటే, కష్టపడి పని చెయ్యటానికి కావల్సిన క్రమశిక్షణ ఉంటే విజయం సులభంగా లభిస్తుంది. మరి ఈ లక్షణాలు మీలో ఉన్నాయా? ఆలోచించండి.

 

గెలుపొందేవారు అద్భుతాలు జరగాలని, సులభమైన పనులు చెయ్యాలని అనుకోరు. అడ్డంకుల్ని దాటటానికి అవసరం అయిన ధైర్యాన్ని, బలాన్ని సమకూర్చుకోవాలనుకుంటారు. ఇంకా సాధించాల్సింది ఏముందా అని ఆలోచిస్తారే కాని, ఏం కోల్పోయానూ అని చూడరు. కోరికలు అన్నీ నిజం కావు, నమ్మకాలు, నెరవేరుతుందనే ధృడ నమ్మకం, అది నెరవేర్చుకునే అంకిత భావమే విజయ సాధనకు ఉపయోగపడతాయి. ధైర్యంగా అడుగు ముందుకు వేస్తేనే లక్ష్యాలు ఫలిస్తాయి. ధైర్యం, దృ ఢ వ్యక్తిత్వం కలిస్తేనే విజయం. సామాన్యుడికి, అసామాన్యుడికి ఇదే తేడా.

 

మన మనసులో ధైర్యం నిండి ఉన్నప్పుడే అన్ని భయాలు మర్చిపోతాం. అడ్డంకుల్ని సులభంగా దాటి పోగలుగుతాం, భయం లేకపోవ టాన్ని ధైర్యం అని అనలేము. భయాన్ని అధికమించటమే ధైర్యం అంటే. అంకిత భావంతో మీరు విజయం సాధించాలంటే.

  •  గెలవటానికే పోరాడండి. ఓడిపోవటానికి కాదు
  • ఇతరుల తప్పులే మీకు పాఠాలుగా భావించండి.
  • ఏ పరిస్థితి వచ్చినా ఉత్తమమైన నైతిక విలువలని వదలకండి.
  • మీ బలాలు, బలహీనతల ఆధారంగా భవిష్యత్ ను  నిర్మించుకోండి.
  •  
  •  విశాల దృక్పథంతో నిర్ణయాలు తీసుకోండి.

దీర్ఘకాలిక ప్రణాళికలు వెయ్యటమే కాక అంకితభావంతో వాటిని సాధించే క్రమంలో మీరు పరిపూర్ణులు కావాలని ఆశిస్తూ….

 అల్ ద బెస్ట్

 కవితా కృష్ణ  (వివేక్  జూన్ 2011 సంచిక )

* పరిపూర్ణమైన వ్యక్తిత్వమే విజయానికి గీటురాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Scroll to Top