satveeracademy

Advertisements

Home

వృత్తం

  • ఒక సమతలంలో ఒక స్థిర బిందువు దూరంలో ఉన్న అనేక బిందువుల సమితిని వృత్తం అంటారు.
  • స్థిర బిందువును వృత్త కేంద్రం అంటారు . దీనిని “ C  లేదా   O”  చే సూచిస్తారు.
  • స్థిర దూరంను వృత్త వ్యాసార్థం అంటారు . దీనిని “ r ”  చే సూచిస్తారు.
  • వృత్త కేంద్రాన్ని మరియు వృత్తంపై ఏదేని బిందువును కలిపే రేఖా ఖండాన్ని వృత్త వ్యాసార్థం అంటారు.

ఒక వృత్తం అది ఉండే తలాన్ని మూడు బిందువుల సమితులుగా విభజిస్తుంది .

       i.            వృత్తం అంతరంలోని బిందువుల సమితి

     ii.            వృత్తం పై గల  బిందువుల సమితి

వృత్తం బాహ్యంలోని బిందువుల సమితి 

  • వృత్తంపై ఏ రెండు బిందువులను కలిపే రేఖా ఖండాన్ని ఆ వృత్త జ్యా అంటారు.
  • ఒక వృత్తానికి అనేక జ్యా లు ఉండును.
  • వృత్తానికి గీయగలుగు  జ్యాల సంఖ్య అనంతం 
  • వృత్తం వ్యాసం :- వృత్తం పరిధి పైన ఉన్న రెండు బిందువులను కలిపే రేఖాఖండం కేంద్రం గుండా పొతే  దానిని ఆ వృత్తం వ్యాసం అంటారు.
  •  
  • వృత్తం వ్యాసంను ‘d’ అక్షరంచే సూచిస్తారు .
  •  
  • వృత్తం వ్యాసం దాని వ్యాసార్థంనకు రెట్టింపు.
  •         వృత్తం వ్యాసార్థం  r  ‘   అయిన వృత్తం వ్యాసం d=2r
  • వృత్తానికి గీయగలుగు అతి పెద్ద  జ్యా ఆ వృత్త వ్యాసం
  • వృత్తం కేంద్రం గుండా పోయే   జ్యాను …….అంటారు  (ఆ వృత్త వ్యాసం)
  •           వృత్తం పై ఉన్న రెండు బిందువుల గుండా పోయే రేఖను (ఖండించే రేఖను) చేధన రేఖ (ఖండన రేఖ) అంటారు.
  • వృత్తం పై ఉన్న ఒక  బిందువు గుండా పోయే రేఖను స్పర్శ రేఖ అంటారు.
  • ఒక  జ్యా  చేతను ,జ్యా  చివరలు గల చాపము చేతను ఆవరిమ్పబడిన ప్రదేశాన్ని ఆ వృత్త ఖండము అంటారు.
  • అల్ప చాపానికి మరియు జ్యా కు మధ్య గల ప్రాంతాన్ని అల్ప వృత్త ఖండమని మరియు అధిక  చాపానికి మరియు జ్యా కు మధ్య గల ప్రాంతాన్ని అధిక  వృత్త ఖండమని అంటారు.

  • ఒక వేళ జ్యా  కనుక వ్యాసమైతే అప్పుడు వ్యాసం వృత్తాన్ని  రెండు సమన వృత్త ఖండా లుగా విభజిస్తుంది.
  • ఒక వృత్త వ్యాసం వృత్తంను   రెండు సమాన వృత్త ఖండాలుగా విభజిస్తుంది.
  •  
  • ఒక వృత్త చాపం యొక్క చివరలు వ్యాసార్థాలు చే ఆవరింపబడిన ప్రదేశాన్ని సెక్టార్ అంటారు.
  • ఒక వృత్త చాపరేఖ మరియు దాని చివరి బిందువులను కేంద్రానికి కలిపే వ్యాసార్థాల మధ్య  ఆవరింపబడిన    ప్రదేశాన్ని సెక్టార్ ( త్రిజ్యాంతరం  )   అంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Scroll to Top