satveeracademy

Advertisements

భిన్నాలు

భిన్నం :- మొత్తంలో కొంత భాగాన్ని భిన్నం అంటారు.

భిన్నము అనగా ఒక మొత్తములో కొంతభాగం లేక ఒక సమూహంలో కొన్ని

భిన్నం ఆంగ్లంలో Fraction అంటారు. Fraction అనే ఆంగ్ల భాష పదం Fractus లేదా Fractio అనే లాటిన్ పదాల నుండి ఉద్భవించినది. 

వాటి అర్థం Break (లేదా ) Broken.

 

భిన్నంలో  a ను లవం అని b ను హారం అని అంటారు .
  • భిన్నాలను వాటి పరిక్రియాలను వివరించిన గణిత శాస్రవేత్త : బ్రహ్మగుప్తుడు
  • బ్రహ్మగుప్తుడు రచించిన గ్రంథం : బ్రహ్మస్పుట సిద్ధాంతం
  • ఈ గ్రంథం కంక అనే పండితుడి ద్వారా పాశ్చాత్య  దేశాలకు వ్యాపించింది.

లవ హారాల పోలికలను బట్టి భిన్నాల రకాలు

క్రమ భిన్నం :-

లవం అనేది హారం కంటే తక్కువగా ఉంటే అటువంటి భిన్నాలను క్రమ భిన్నాలు అంటారు.

క్రమభిన్నం విలువ ఎల్లప్పుడూ ఒకటి కన్నా తక్కువ .

అపక్రమభిన్నం (Improper Fraction) :-

 

లవం అనేది హారం కంటే ఎక్కువగా లేదా సమానంగా ఉంటే అటువంటి భిన్నాలను అపక్రమ భిన్నాలు అంటారు .

 

ఒక అపక్రమభిన్నం విలువ ఎల్లప్పుడూ ఒకటి కన్నా ఎక్కువ లేదా ఒకటికి సమానం .

మిశ్రమ భిన్నం : (Mixed Fraction)

ఒక పూర్ణాంకం మరియు క్రమ భిన్నం కలిసి ఉంటె అటువంటి భిన్నాలను మిశ్రమ భిన్నాలు అంటారు

ప్రమాణ భిన్నం ఏకాంక భిన్నం యూనిట్ భిన్నం ( Unit Fractions)

లవం 1 గా కలిగినట్టి భిన్నాలను ప్రమాణ భిన్నాలు లేదా  యూనిట్ భిన్నాలు అంటారు.

ఒక ప్రమాణ భిన్నం విలువ ఎల్లప్పుడూ 1 కన్నా తక్కువ. 

 

error: Content is protected !!
Scroll to Top