satveeracademy

Advertisements

గణితం ప్రాముఖ్యత- Importance of Mathematics

గణితం ప్రాముఖ్యత
  • గణితం అనేది ఒక సబ్జెక్ట్ గా మాత్రం చూడకండి . ఇది మన నిజ జీవితంలో చాలా విషయాలలో అవసరం అవుతుంది  .
  • గణితం వ్యక్తి యొక్క జీవితాన్ని క్రమబద్దంగా చేస్తుంది .
  • గణితశాస్రం ద్వారా పెంపొందించే కొన్ని లక్షణాలు తార్కిక శక్తి , సృజనాత్మకత , సమస్య పరిష్కార సామర్థ్యం ,విమర్శానాత్మక ఆలోచన  .
  • ఏ వృత్తిని నిర్వహించాలన్నా లేదా ఏ పనిని చేయాలన్నా గణితశాస్త్ర పరిజ్ఞానం ఎంతో అవసరమౌతుంది. గణితశాస్త్ర పరిజ్ఞానం లేనిదే ఏ వృత్తి కాని ఏ విభాగం కానీ  సంపూర్ణం కాలేవు.
  • దీని గురించి తెలుసుకోవడానికి  కొంత సమయం పాటు ఈ ప్రపంచంలో గణితం లేదని ఊహించుకొని చూద్దాం ?
  • గడియారం లేదా కాలెండర్ లేని మీ జీవితాన్ని ఊహించుకోండి.  ఈ రెండూ గణితానికి ప్రాథమికమైన, ముఖ్యమైన  సంఖ్యల పై ఆధారపడ్డాయి.  రోజులో ఎంత సమయమైందని నీవు ఎలా తెలుసుకొంటావు? కాలెండర్ సహాయం లేకుండా నీ పుట్టిన రోజుని నీవు  జరుపుగోగలవా ?
  • నీవు కొన్ని వస్తువులను  కొనడానికి ఒక దుకాణానికి వెళ్ళావు , ఇప్పుడు గణితం లేదనేది గుర్తుంచుకో, కావున డబ్బంటే ఏమిటో తెలియదు , కొలత అంటే ఏమిటో తెలియదు. అపుడేమి చేస్తావు ?
  • నాడిని పరీక్షించే వైద్యుడైనా , భూమి పై ఎన్ని రకాలు, జీవజాతులున్నాయని అంచనా వేసే జంతుశాస్త్రవేత్త కైనా లెక్కించడం అంటే ఏమిటో తెలియాలి .
  • గణితశాస్త్ర  పరిజ్ఞానం  లేకుండా  ఇంజనీర్ ( యంత్ర నిర్మాత)  కూడా  వంతెనలని నిర్మించలేడు.
  • ఎంత పరిమాణంలో వివిధ రకాల రసాయనాలను కలపాలో తెలుసుకోలేకపోతే  ఒక రసాయనవేత్త కూడా ఒక మందుని తయారు చేయలేడు. 
  • ఈ గణితం లేకుండా ఈ ప్రపంచంలో వ్యాపారం లేదా మార్కెట్ లేవు ఎందుకంటే ఇవన్నీ డబ్బు పై ఆధారపడినవి.
  •   అలాగే ఏ దేశ అభివృద్ది అయినా ఎక్కువగా ఆ దేశఆర్ధిక  ప్రగతి పై మాత్రమే  ఆధారపడ్డాయి, కావున ఇది కూడా ఒక సమస్య అవుతుంది. 
  •  గణితం లేకుండా సాంకేతిక పరిజ్ఞానంలో పురోగతి ఉండదు , ఎందుకంటే  ఈ సాంకేతిక పరిజ్ఞానం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో గణితంపై ఆధారపడి ఉంది. మనం ఈ సాంకేతిక పరిజ్ఞానంపై ఎంతగానో  ఆధారపడ్డాం అంటే ,దీని ఆధారంగా నిర్మించిన కంప్యుటర్, సెల్ ఫోన్ లేదా  టెలివిసన్, లేని జీవితాన్ని ఊహించలేము.
  •  అలాగే విద్యుత్ లేకుండా మన జీవనాన్ని కొనసాగించలేము. విద్యత్ కేంద్రాలలో జనింపచేసే విద్యుత్ కూడా గణితంతో సంబంధించినదే.
  • గణితమంటే ఎంతో భయమున్నా నిత్యజీవితంలోని దీని విస్త్రుత ఉపయోగం వలన దీనిని ఉపయోగించవలసినదే. నిజానికి గణితమే లేకుంటే మన జీవితాలు చాలా సంక్లిష్టంగా ఉండేవేమో !  
  • గణితశాస్త్ర  ప్రాముఖ్యత తెలిసి  కూడా చాలా మంది దీనిని గురించి తెలుసుకొనేందుకు , అవగాహన చేసుకునేందుకు అయిష్టత చూపిస్తారు. గణితంలో ప్రాథమిక భావనలపై పట్టు ఉంటే గణితమన్నది అసలు కష్టమే కాదు.
  • నిజానికి గణితం అందరూ ఊహిస్తున్నట్లు సంక్లిష్టమైనది కాదు , వారి దృక్పథమే ఈ విధంగా చేస్తూన్నది. 
  •  మీకు ప్రాథమిక పాఠశాలలో కూడికలను, తీసివేతలను, గుణకారాలను, భాగాహారాలను బోధించారు.  అప్పటి నుండి నీవు ఇతర భావనలను అభ్యసించ డానికి వీటిని ఉపయోగిస్తున్నావు. 
  •  ఈ ప్రాథమిక భావనలను ఉపయోగించకుండా సరళ వడ్డీ , శాతాలు వైశాల్యం, పరిమాణం, బీజగణితం మరియు  త్రికోణమితి లేదా ఇంకేవైనా సమస్యలను పరిష్కరించ గలవా ?
  • గణితం లోని మిగిలిన ఇతర భావనలన్నీ ఈ ప్రాథమిక భావనలపై  ఆధారంగా ఏర్పడినవే .  ఈ ప్రాథమిక భావనలను సరిగా అవగాహన చేసుకోలేకపోతే మనం  కొత్తగా బోధించే భావనలకు ఈ భావనలను అనువర్తించడంలో విఫలమౌతాము.
  • గణితం  పట్ల  భయంతో గణితం అంటేనే తీసి ప్రక్కకు పెట్టి 10 వ తరగతి ఉత్తీర్ణత అయిన తరువాత గణితం లేని గ్రూపు తీసుకుంటున్నారు.
  • గణితం తో కూడిన గ్రూప్స్  చాలా వరకు మరియు అత్యధిక ఉద్యోగాలు  ప్రభుత్వం మరియు ప్రవేట్ రంగాలలో వాటికి నిర్వహించే పరీక్షలలో గణితం సంబంధిత ప్రశ్నలు ఎక్కువ భాగం ఉండును.
  •  అలాగే కొన్ని కోర్సులలో  గణితం సబ్జెక్టు  అవసరం లేనప్పటికి ఆ కోర్సు ప్రవేశ పరీక్షలో మాత్రం గణితం అవసరం అగును.
  • మీరు గణితం రాక వేరే గ్రూపు  తీసుకోవడం కాకుండా  వేరే  గ్రూపు పట్ల ఇష్టం తో తీసుకోవాలి
  • మీరు నేర్చుకోగలిగితే మీ తరువాతి తరం కు మీరు నేర్పగలరు .  
  • మీకు గణితం నేర్పుటకు ప్రభుత్వం వివిధ  కార్యక్రమాలు  ( 3R’s  మరియు ABC  ) నిర్వహిస్తుంది .
  • అలాగే మీకు భోధించే ఉపాధ్యాయులు ప్రయత్నిస్తున్నారు .  కాని మీ ప్రయత్నం లేకుండా మీరు నేర్చుకోలేరు . కాబట్టి మీరు గణితం పట్ల ముందుగా భయం వీడి ఇష్టం పెంచుకుంటే నేటి కాలంలో మీరు సొంతంగా నేర్చుకునే అవకాశం చాలా ఉంది  .
  • మనం కంటికి కనబడని కరోనా తొనే పోరాడుతున్నాం అలాంటిది గణితం నేర్చుకోవడం ఎటువంటి కష్టం కాదు అని అనుకుంటూ  విద్యార్థులు అందరూ కూడా ఇష్ఠం తో గణితం నేర్చుకోని అందరూ ఉత్తీర్ణత సాధించుటకు నా వంతుగా ఇది ఒక చిన్న ప్రయత్నం.

           ధన్యవాదములు

                            N. Raju               

                                M.Sc. B.Ed

error: Content is protected !!
Scroll to Top