satveeracademy

Advertisements

క.సా.గు (కనిష్ఠ సామాన్య గుణిజం)
(Least Common Multiple)

ఇచ్చిన సంఖ్యల గుణిజాలలో ఉమ్మడిగా ఉన్న గుణిజాలను ఆ రెండు సంఖ్యల సామాన్య గుణిజాలు అంటారు.

ఒక సంఖ్యకు గల గుణిజాలు అపరిమితం.

రెండు సహజ సంఖ్యలకు గల గుణిజాలు అపరిమితం కావున ఆ సంఖ్యల సామాన్య (ఉమ్మడి ) గుణిజాలు అపరిమితం.

రెండు కాని అంతకంటే ఎక్కువగాని సంఖ్యల సామాన్య గుణిజాలలో మిక్కిలి చిన్న దానిని క. సా. గు (కనిష్ఠ సామాన్య గుణిజం) అంటారు.

రెండు లేదా అంతకంటే ఎక్కువ సహజ సంఖ్యల గుణిజాలలో కనిష్ట ఉమ్మడి గుణిజమును ఆ సంఖ్యల కనిష్ట సామాన్య గుణిజము అంటారు .

ఇచ్చిన సంఖ్యల చేత నిశ్శేషంగా భాగించబడే కనిష్ట సంఖ్యను క. సా.గు అంటారు.

error: Content is protected !!
Scroll to Top