satveeracademy

Advertisements

NMMS Exam Notification- 2023 Details , syllabus Exam pattern

Home Main

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్

National Means cum merit Schlorship Test-2022-23

 ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభావంతులైన విద్యార్ధులను ఆర్థికంగా ఆదుకొని. డ్రాపవుట్ల సంఖ్యను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పథకాన్ని అమలు చేస్తోంది.

ముఖ్యంగా తొమ్మిదో తర గతి నుంచి ఇంటర్మీడియెట్ వరకూ చదివే పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం ఈ స్కాలర్షిప్ అందిస్తోంది.

దేశ వ్యాప్తంగా ప్రతి ఏటా లక్ష మందికి కేంద్ర ప్రభుత్వం ఈ ఉపకార వేతనాలను ప్రకటిస్తోంది.

రూ.12 వేల స్కాలర్షిప్

 ఈ స్కీమ్కు ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి మొత్తం రూ.12000 స్కాలర్షిప్ అందిస్తారు.

తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ /10 +2 తత్సమాన తరగతి పూర్తిచేసే వరకు ఈ స్కాలర్షిప్ లభిస్తుంది.

 

తొమ్మిదో తరగతి నుంచి పదోతరగతికి స్కాలర్షిప్ కొనసాగాలంటే. అభ్యర్థి 55 శాతం మార్కులతో ప్రమోట్ కావాలి.

అలాగే పదోత రగతిలో 60 శాతం మార్కులు సాధిస్తే.. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉపకార వేతనం అందుతుంది.

ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 55 శాతం మార్కులతో ప్రమోట్ అయితే రెండో సంవత్సరంలో స్కాలర్షిప్ అందిస్తారు.

ఇందుకోసం విద్యార్థులు ప్రతి ఏటా స్కాలర్షిప్ రెన్యూవల్ చేసుకోవాలి.

అర్హత

7 తరగతిలో కనీసం 55 శాతం మార్కులు లేదా దానికి సమానమైన గ్రేడు పొందిన విద్యార్థులు ఎన్ఎంఎంఎస్ పరీక్ష రాయడానికి అర్హులు.

తుది ఎంపిక సమయం నాటికి ఎని మిదో తరగతిలో 55 శాతం మార్కులు పొందిఉండాలి.

ప్రభుత్వ, ఎయిడెడ్, స్థానిక సంస్థల పాఠశా లల్లో రెగ్యులర్ విధానంలో చదవుతూ ఉండా లి.

నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు, సైనిక్ స్కూళ్లు, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అన్ని రకాల రెసిడెన్షియల్ స్కూళ్ల విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు కాదు.

అలాగే ప్రయివేట్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు ఈ పథకం వర్తించదు. •

విద్యార్థి కుటుంబ వార్షి కాదాయం రూ.1,50,000 మించకూడదు.

 ఎంపిక విధానం

రాత పరీక్ష ద్వారా విద్యార్థులను స్కాలర్షి ఏకు ఎంపిక చేస్తారు.

రాష్ట్రాల వారీగా నిర్ణీత పద్ధ తిని అనుసరించి స్కాలర్షిప్స్ సంఖ్యను నిర్ణయి స్తారు.

ఆయా రాష్ట్రాల నిబంధనలను అనుసరించి  రిజర్వేషన్లు అమలు చేస్తారు.

పరీక్ష

* ఈ స్కాలర్షిప్సుక్కు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు రాష్ట్రస్థాయిలో రాత పరీ క్షలు నిర్వహిస్తారు.

ఇందులో రెండు పేపర్లు ఉంటాయి.

1)                   MAT మెంటల్ ఎబిలిటీ టెస్ట్ (మ్యాట్); మానసిక సామర్థ్య పరీక్ష

ఈ పేపర్లో వెర్బల్, నాన్ వెర్బల్ రీజనింగ్, క్రిటికల్ థింకింగ్ నుంచి 90 ప్రశ్నలు 90 మార్కులకు ఉంటాయి. *

2 SAT స్కాలాస్టిక్ అప్టిట్యూడ్ టెస్ట్ (శాట్):

ఈ పేపర్ లోనూ 90 ప్రశ్నలు –90 మార్కులకు ఉంటాయి.

ఏడు, ఎనిమిది తరగతుల స్థాయిలో బోధించిన  సైన్స్, సోషల్, మ్యాథ్స్ సబ్జెకుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. •

 పరీక్ష సమయం: ఒక్కో పేపరుకు 90 నిమిషాల సమయాన్ని కేటాయిస్తారు. మొత్తం 3 గంటల సమయం

 కనీస మార్కులు

* రెండు పరీక్ష(మ్యాట్, శాట్)ల్లో సగటున జన రల్ అభ్యర్థులకు 40శాతం మార్కులు,

 ఎస్సీ/ ఎస్టీ విద్యార్థులకు 32 శాతం మార్కులను కనీస అర్హత మార్కులుగా నిర్ణయించారు.

జిల్లాను యూనిట్గా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు కేటగిరీల వారీగా

 ఎస్సీ/ఎ స్టీ/బీసీ/దివ్యాంగులకు రిజర్వేషన్ ప్రకారం అర్హత పొందిన విద్యార్థుల మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు.

 

దరఖాస్తు విధానం :-  రాష్ట్ర ప్రభుత్వ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో విద్యార్థుల దరఖాస్తులను ఆయా స్కూప్లు సమర్పించాలి. అనంతరం ఆ దర ఖాస్తుల ప్రింటవుట్లను ఆదాయం, కుల ధ్రువీకర ణ తదితర అటెస్టెడ్ కాపీలను డీఈఓలకు పంపా లి.

 దీంతోపాటు ప్రతి విద్యార్థికి పరీక్ష ఫీజు రూ. 100స్బీఐ చలానా రూపంలో జతచేయాలి.

 

అకౌంట్లోకే స్కాలర్షిప్

 

ఈ స్కాలర్షిప్కు ఎంపికైన విద్యార్థులు  అకౌంట్ను జాతీయ బ్ఓయాంకులో పెనేయాలి. 

రాష్ట్ర ప్రభుత్వం పంపిన జా బితా ప్రకారం ప్రతి మూడు నెలలకు ఒకసారి రూ.3000లు లేదా సంవత్సరం కు ఒక్కసారి  12000 లను అభ్యర్ధుల ఖాతాలో జమచేస్తారు.

 ముఖ్యమైన సమాచారం

 * దరఖాస్తు విధానం:  apply Online  from your school

 

ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ::   13.10.2023     (Telangana)

తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెబ్ సైట్: 

bse.telangana.gov.in

https://www.bse.telangana.gov.in/NMMS.aspx

www.bseap.org

మానసిక సామర్థ్య విభాగం (Mental Ability Section)

 1) సాధారణ విభాగం (Verbal) :

1. Number Series

2. Alphabet Series

3. పదాల భిన్నపరీక్ష ( Word Analogy)

4. సంఖ్యల భిన్నపరీక్ష

5. పోలిక పరీక్ష (Analogy

6. Number Analogy

7. Alphabet Analogy

8. Coding-Decoding

9. లాజికల్ వెన్ చిత్రముల పరీక్ష (Logical Venn Diagrams)

10. Alphabetical order of Words

11. Number Ability

12. గణిత సమీకరణాలను తుల్యము చేయుట (Balancing the Mathematics Equation)

13. మిస్సింగ్ క్యారెక్టర్ ( Missing Character)

14. గణితపు గుర్తుల పరీక్ష

ii) బొమ్మల విభాగం (Non Verbal) :

1. సిరీస్ (Series)

2. పోలిక పరీక్ష (Analogy)

3. వర్గీకరణ (Classification)

4. బిందు స్థానము (Dot Situation)

5. పటమును పూరించు భాగమును ఎంపిక చేయుట (Incomplete figure Completion)

6. (Cutting Figures)

 

విషయ సామర్థ్య విభాగం (Scholastic Aptitude Section

 

·       గణితశాస్త్రం    ( 20 Marks )

·       భౌతిక శాస్త్రం   ( 10 to 12  marks)

·       రసాయనశాస్త్రం   ( 9 to 11  marks)

·       జీవశాస్త్రం   ( 10 to 12 marks)

·       భూగోళ శాస్రం   ( 10 marks)

·       చరిత్ర  ( 10 marks)

·       రాజనీతి శాస్త్రం   ( 10 marks)

·       అర్థ శాస్త్రం   ( 5 marks)

గణితంలో కనీస అభ్యసన సామర్థ్యాలు
Minimum Learning Abilities in Maths

error: Content is protected !!
Scroll to Top