satveeracademy

Advertisements

సరళరేఖలు తిర్యగ్రేఖ Parallel Lines transversal

ఒక తలములోని రెండు వేరువేరు సరళ రేఖలను రెండు వేరువేరు బిందువుల వద్ద ఖండించే  మరొక సరళ రేఖను తిర్యగ్రేఖ అంటారు .
రెండును అంతర కోణాలై  అవి  తిర్యగ్రేఖకు చెరో వైపున ఉండి అవి ఆసన్న కోణాలు కానిచో అట్టి కోణాల జతను ఏకాంతర కోణాలు అంటారు.
రెండును బాహ్య కోణాలై  అవి  తిర్యగ్రేఖకు చెరో వైపున ఉండి అవి ఆసన్న కోణాలు కానిచో  అట్టి కోణాల జతను “ఏక బాహ్య కోణాలు “ అంటారు.
తిర్యగ్రేఖకు  ఒకే వైపు ఉండి   ఒకటి అంతర కోణము , రెండవది బాహ్యా కోణముగా ఉండి  అవి  ఆసన్న కోణము లు కానిచో అట్టి కోణాల జతను  సదృశ కోణములు  అంటారు.
తిర్యగ్రేఖకు ఒకే వైపు  ఉన్న  అంతర కోణాలను  సహా అంతర కోణాలు లేదా వరుస అంతర కోణాలు  జత అంటారు .
తిర్యగ్రేఖకు ఒకే వైపు  ఉన్న బాహ్య కోణాలను  సహా బాహ్య కోణాలు లేదా వరుస బాహ్య కోణాలు  జత అంటారు .
రెండు ఏకతల సమాంతర రేఖలను ఒక తిర్యగ్రేఖ ఖండించగా ఏర్పడు ఏకాంతర కోణాలు  సమానం .
∠4=∠6    ;  
 ∠3 =  ∠5
రెండు ఏకతల సమాంతర రేఖలను ఒక తిర్యగ్రేఖఖండించగాఏర్పడు ఏక బాహ్య కోణాలు సమానం .
∠1=∠7    ;   
∠2 =  ∠8
రెండు ఏకతల సమాంతర రేఖలను ఒక తిర్యగ్రేఖ ఖండించగా ఏర్పడు సదృశ్య కోణాలు సమానం .
∠1=∠5    ;  
 ∠2 =  ∠6  ;
4=∠8    ;   
3 =  ∠7
సహా అంతరాకోణాలు  సంపూరకాలు,  
∠3+∠6=1800    ;
   ∠4+  ∠5=1800
సహాబాహ్య కోణాలు  సంపూరకాలు     
∠1+∠8=1800     ; 
  ∠2+  ∠7= 1800
error: Content is protected !!
Scroll to Top