satveeracademy

Advertisements

త్రిభుజం 

  • మూడు రేఖాఖండాలు గల సరళ సంవృత పటాన్ని త్రిభుజం అంటారు .
  • ఒక తలంలో సరేఖీయాలు కాని బిందువులతో  రెండేసి బిందువులను తీసుకొని  రేఖాఖండలచే కలిపినా త్రిభుజం ఏర్పడుతుంది.
  • AB, BC, CA రేఖాఖండాల ను త్రిభుజం భుజాలు అంటారు.
  • రెండు భుజాల ఖండన బిందువులైన A, B, C లను త్రిభుజం శీర్షాలు అంటారు .
  • A శీర్షం BC  భుజానికి ఎదురుగా
  • B శీర్షం AC భుజానికి ఎదురుగా
  • C శీర్షం AB భుజానికి ఎదురుగా ఉండును .
  • త్రిభుజానికి 3 కోణాలు ఉండును .  ∠A,  ∠B,  ∠C
  • త్రిభుజం ABC భుజాల పొడవుల మొత్తమును దాని చుట్టుకొలత అంటారు
  •  త్రిభుజానికి 3 భుజాలు , 3 శీర్షములు మరియు 3 కోణాలు ఉండును.

ఒక త్రిభుజం అది ఉండే తలాన్ని మూడు బిందువు సమితులుగా విభజిస్తుంది

  1.             త్రిభుజ అంతరంలోని బిందువు సమితి
  2.             త్రిభుజం పై బిందువు సమితి
  3.  త్రిభుజ బాహ్యంలోని బిందువు సమితి

error: Content is protected !!
Scroll to Top